మోదీ ఆర్థిక విధానాలతో దేశం సంక్షోభం వైపు
విశ్వంభర, హిమాయత్ నగర్ : ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలతో మోదీ దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి. నరసింహ విమర్శించారు. సిపిఐ హైదరాబాదు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదు బషీర్‌బాగ్ నుంచి జిఎస్‌టిభవన్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పబ్లిక్ సెక్టార్ సంస్థలను ప్రైవేట్ చేతుల్లోకి ఇస్తున్నారని, పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించారు. దేశ అప్పులు భారీగా పెరిగాయని, నిరుద్యోగ సమస్యపై ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఈ ధర్నాలో స్టాలిన్, కమతం యాదగిరి, ఎన్. శ్రీకాంత్, సలీం ఖాన్, శంషుద్దీన్, కాంపల్లి శ్రీనివాస్, పడాల నళిని, ఉమర్ ఖాన్, బి. వెంకటేశం, ఎం. ప్రవీన్ కుమార్ గౌడ్, పల్లె నరసింహ, ఎం. అనిల్ కుమార్, నరేష్, షక్రీ బాయి, తదితరులు పాల్గొన్నారు.