బీజేపీకి ప్రజల మద్దతు : సూర్యప్రకాష్ సింగ్

విశ్వంభర, బర్కత్ పుర  : రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కోశాధికారి ఏ. సూర్యప్రకాష్ సింగ్ తెలిపారు.   నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా నాలుగువేల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా  గురువారం హైదరాబాదు బర్కత్పురన లో విలేకరులతో చిట్ చాట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశ భద్రత, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేసి సుపరిపాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ఫలితంగా ప్రజల విశ్వాసం బీజేపీపై పెరుగుతోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రజలు మద్దతు ఇస్తారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి అడ్డంకులు సృష్టించినా ప్రజలు బీజేపీ వైపే నిలుస్తారని అన్నారు. పార్టీ పిలుపు మేరకు చిట్‌చాట్ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు వాటిలో పాల్గొనాలని కోరారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/peoples-support-for-bjp-is-suryaprakash-singh/article-16564

Tags: