సంతోష్ నగర్ లో పోలీసుల కార్డన్   అండ్ సెర్చ్ 

సంతోష్ నగర్ లో పోలీసుల కార్డన్   అండ్ సెర్చ్ 

 విశ్వంభర, సంతోష్ నగర్ :  సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహమ్మద్ నగర్, జావిద్ నగర్, కలికా నగర్ ప్రాంతాలలో పోలీసులు  కా ర్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా సంతోష్ నగర్ ఏసీపీ సుఖదేవ్ సింగ్, ఇన్స్పెక్టర్  సత్యనారాయణ మాట్లాడుతూ,  500 ఇండ్లలో సోదాలు చేయగా నెంబర్ ప్లేట్ లేని 47 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.  అలాగే 56 అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఇంకా 11 మంది రౌడీషీటర్లను 7 మంది అనుమానిత వ్యక్తులను గుర్తించినట్టు చెప్పారు.  అలాగే 5 చిన్న సిలిండర్లలో నాలుగు నిండు గాను ఒకటి ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు. పోలీసు శాఖపై  ప్రజలనమ్మకాన్ని మరింత బలోపేతం చేసేలా ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతా యని తెలిపారు.

Tags: