ఓటు హక్కు వినియోగించుకున్న డాక్టర్ దంపతులు
On
విశ్వంభర, చేవెళ్ల : చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు రామన్నగూడ గ్రామంలో యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి, డాక్టర్ వ్యూహ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారితోపాటు స్థానిక నాయకులు కూడా పాల్గొని ఓటు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వైభవ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని బలపరిచే ఈ ఓటింగ్ ప్రక్రియలో ప్రతి ఓటరు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు.



