హరికృష్ణకు మంత్రి వివేక్ పరామర్శ 

హరికృష్ణకు మంత్రి వివేక్ పరామర్శ 

విశ్వంభర, సిద్దిపేట: అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి పూజల హరికృష్ణను ఉమ్మడి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్దిపేటలోని ఆయన నివాసంలో మంగళవారం  కలిసి పరామర్శించారు. హరికృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడే నాయకుడైన హరికృష్ణ పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో మరింత ఉత్సాహంతో పాల్గొనాలని ఆకాంక్షించారు. పరామర్శలో పార్టీ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి, కలీముద్దీన్ అహ్మద్, కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం యాదవ్, పూజల గోపికృష్ణ, రాజబాహదూర్ రెడ్డి, కొత్త మహిపాల్ రెడ్డి, ఎర్ర మహేందర్, వాహబ్, గాయసుద్దీన్, రషద్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, అంబటి మహేష్, ఎర్ర నవీన్ కుమార్, చెంది శ్రీనివాస్ ముదిరాజ్, జనార్దన్ రెడ్డి, ప్రవీణ్,  తదితరులు ఉన్నారు.

Tags: