ఉద్యమ ఆశయాల సాధన కై “ఈ నెల 14 న చలో ఎల్బీనగర్ “

గన్ పార్క్ వద్ద పోస్టర్ ను ఆవిష్కరించిన టీజేఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ ప్రో. కోదండరాం , ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ కాచం సత్యనారాయణ .

ఉద్యమ ఆశయాల సాధన కై “ఈ నెల 14 న చలో ఎల్బీనగర్ “

విశ్వంభర, హైదరాబాద్: ఉద్యమ ఆశయ సాధన కై , ఉద్యమ కారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 14 న నిర్వహించనున్న “చలో ఎల్బీనగర్ “ గోడ పత్రికను గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రో కోదండరాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కాచం సత్యనారాయణ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14 న నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు, కూర రమేష్, ఇరుగు శ్రీధర్,కొత్త రవి,ఆటో శ్రవణ్, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: