విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ 

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ 

విశ్వంభర, కేసముద్రం: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్వలలో స్పూర్తి ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఆధ్వర్యంలో పద జీవివ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ  చేసారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు  బండారు నరేందర్ మాట్లాడుతూ,  ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పరీక్షల సమయానికి  అవసరమైన సామాగ్రిని అందించి వారికి ప్రోత్సాహం కలిగించడం నిజంగా అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి విద్యాభివృద్ధి కోసం  సేవా కార్యక్రమాలు స్ఫూర్తి ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ కమిటీ నిర్వహించడం చాలా గర్వకారణ మన్నారు. ఈ కార్యక్రమం లో గౌరవ సభ్యులు రాయపాటి కృపాకర్ రెడ్డి సంస్థ ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణయ్య కోశాధికారి ఆకుల శ్రీకాంత్ ఉపాద్యాయులు ఆర్ ఏకాంబరం,బి సత్యనారాయణ, తండ సదానందం, వి నాగేందర్, రాగి బిక్షపతి, ఎం యాకాంబరం , బాలాశౌరీరెడ్డి, , మార్గం శ్రీనివాస్, కే పార్వతి, జి నాగరాజు, ఆవుల లింగయ్య, .రాధాదేవి, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: