ఇఫ్తార్ విందులో పాల్గొన్న సబితారెడ్డి
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలం దుబ్బచర్ల గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాంగీర్ పాషా, ఎస్ జె ఆర్ , సన్స్ గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రంజాన్ ఉపవాసాల సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొంటున్న అందరికీ ధన్యావాదాలు తెలియజేస్తూ, రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదిగా, ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ భగవంతున్ని ప్రార్థిస్తూ ఉంటారని అన్నారు.రంజాన్ తోఫా తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు ఇమామ్, మొజామ్ లకు శాలరీలు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ అందించారు ప్రతి నియోజకవర్గంలో ఇఫ్తార్ విందులను తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ మాత్రమే నిర్వహించారన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకా ఇఫ్తార్ విందులు లేవు, రంజాన్ తోఫాలు లేవు అని ఎద్దేవా చేశారు, ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ లు, పిఎసిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.



