దేవాలయాల పరిరక్షణ కమిటీ ఎన్నిక 

దేవాలయాల పరిరక్షణ కమిటీ ఎన్నిక 

 విశ్వంభర, బండ్లగూడ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర సర్కిల్ ధమ్మాయిగూడ డివిజన్ బండ్లగూడలో గ్రామ దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా కొత్త భాస్కర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పోలు సంతోష్ గౌడ్ నియమితులయ్యారు. బండ్లగూడ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల పరిరక్షణ కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పెద్దల సమక్షంలో గ్రామంలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి దేవాలయం, పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, నాచుకుంట చెరువు మైసమ్మ తల్లి, వీకర్ సెక్షన్ కాలనీ పోచమ్మ తల్లి దేవాలయాల అభివృద్ధి, పరిరక్షణకై ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు కొత్త భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ.. బండ్లగూడలో ఆలయాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తనను ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి పోలు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో నిరంతరం కృషి చేస్తానని ఈ అవకాశం రావడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు,గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మిగతా కమిటీ సభ్యుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags: