చేనేత కార్మికుడి ఆత్మహత్య
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు ( 39 ) చేనేత పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. 5 సంవత్సరాల క్రితం భువనగిరిలోని 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీలో మూడు లక్షల యాబై వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పుకు ప్రతి నెలా వాయిదాలు కట్టినాడని, గత రెండు నెలల నుండి నేతపని సరిగ్గా నడవక పోవడంతో నెల వాయిదాలు కట్టలేక మనస్తాపానికి గురై మంగళ వారం ఉదయం తన ఇంట్లో ఎవరులేని సమయంలో గుర్తు తెలియని పురుగుల మందు తా గి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య మిర్యాల అంజలి మండల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, రామన్నపేట మండల ఎస్సై డి.నాగరాజు తెలిపారు.



