కోమటి పల్లిలో ఫాగింగ్
On
విశ్వంభర,ఇనుగుర్తి: విజృంభిస్తున్న దోమలను అరికట్టడానికి ఇనుగుర్తి మండలం కోమటిపల్లి లో ఆ గ్రామ సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ గ్రామపంచాయతీ సిబ్బందిచే ఫాగింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ, కోమటిపల్లి గ్రామం తో పాటు గ్రామ పరిధిలోని తండాలలో దోమల బెడద ఎక్కువ గా ఉండి ప్రజలు అవస్థలకు గురవుతున్నారన్నారు. దీంతో దోమల నివారణ మందుతో ఫాగింగ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత తండా సర్పంచి నరేష్, తదితరులు పాల్గొన్నారు.



