రెట్టింపు ఉత్సాహంతో పని చేయండి
- ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్
విశ్వంభర, హైదరాబాద్ : అవార్డులు, రివార్డులు తీసుకోవడంతో పాటు మరింతగా ఉత్సహాంగా పని చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు మంచి పేరు తీసుక రావాలని ఎక్సైజ్ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం అన్నారు. అబ్కారీ భవన్‌లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ చాంబర్‌లో 14 టీమ్‌లకు నగదు రివార్డ్ అందించారు. ఈ నగదు రివార్డుల పంపిణిలో డైరెక్టర్ తోపాటు జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, డిప్యూటి కమిషనర్ ప్రణవీలు ఉన్నారు.మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి.శ్రీనివాసరెడ్డి టీమ్‌లకు సంగారెడ్డిలో 850 కేజీల గంజాయితో పాటు ముగ్గురికి 20 సంవత్సరాల శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టిన టీమ్‌కు, నర్సాపూర్‌లో 587.25 లీటర్ల ఎన్‌డీపీఎల్ మద్యం పట్టుకున్న టీమ్‌కు, పటాన్ చెరువులో 122.85 కేజీల గంజాయిని పట్టుకున్న టీమ్‌కు నగదు రివార్డులను అందించారు. ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ టీమ్‌లు వైరా స్టేషన్ పరిధిలో 101.5 కేజీల గంజాయి, 2.7 కేజీల హషీస్ అయిల్ కేసును పట్టుకున్న టీమ్‌కు, భద్రాచలంలో 50.4 కేజీల గంజాయిని పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌కు, నేలకొండపల్లిలో 21,420 కేజీల బెల్లాన్నిపట్టుకున్నటీమ్‌కు ,అశ్వారావుపేట్‌లో 4104 కేజీల బెల్లాన్ని పట్టుకున్న టీమ్‌లకు నగదు రివార్డులను అందించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో 4080 కేజీల బెల్లాని పట్టుకున్న టీమ్‌కు నగదు రివార్డులను అందించారు. భద్రాచలం 2.2 కేజీల హషీస్ అయిల్ పట్టుకున్న ఎస్టీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లులకు, ధూల్‌పేట్ సీఐ మధుబాబుకు నగదు రివార్డులను అందించారు.వీరీతోపాటు ఎస్టీఎఫ్ ఏ టీం నంద్యాల అంజిరెడ్డి టీమ్‌కు, సికింద్రాబాద్‌లో 206.75 లీటర్ల ఎన్‌డీపీఎల్ లిక్కర్‌ను పట్టుకున్న సీఐ జగన్‌మోహన్‌రెడ్డికి, మీర్‌పేట్‌లో 64.6 టీటర్ల ఎన్‌డీపీఎల్ మద్యాన్ని ఎంపీఆర్ చంద్రశేఖర్ టీమ్‌కు, అదిలాబాద్‌లో 63.80 లీటర్ల మద్యాన్ని పట్టుకున్న ఎస్టీఎఫ్ సీఐ బిక్షారెడ్డికి, ఉప్పల్‌లో 61.80 లీటర్ల మద్యాన్ని పట్టుకున్న ప్రదీప్‌రావు టీమ్‌కు అమీర్‌పేట్‌లో 50.62 టీటర్ల మద్యం పట్టుకున్న స్మీత సౌజన్య టీమ్‌కు నగదు రివార్డులను అందించారు.



