మహేశ్వరం సీఐ కి సన్మానం
On
విశ్వంభర, మహేశ్వరం:మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ రాఘవేందర్ రెడ్డిని నాగారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు సన్మానించారు. మాజీ సర్పంచ్ కావలి దశరథ మాట్లాడుతూ, మహేశ్వరం మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రతి గ్రామం ప్రశాంతంగా ఉండాలని కోరారు, గంజాయి, డ్రగ్స్ పై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు, గ్రామాలలో బెల్టు షాపులు ఎక్కువ కావడంతో మద్యానికి బానిస అవుతున్నారని వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని నూతన సీఐ రాఘవేందర్ రెడ్డిని దశరథ కోరారు.



