ప్రజలకు ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు
On
విశ్వంభర, సూర్యాపేట: రంజాన్ పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరపున ముస్లిం సోదరులకు, జిల్లా ప్రజలకు ఎస్పి నరసింహ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని కోరారు. ఎల్లప్పుడు ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా, సోదరభావంతో మెలిగి, అందరూ వారి వారి కుటుంబసభ్యులతో , సుఖ సంతోషములతో వర్ధిల్లి సమాజంలో శాంతి స్థాపనకు అందరు కృషి చేయాలని అన్నారు.



