27న సీతారాముల శోభాయాత్ర

27న సీతారాముల శోభాయాత్ర

విశ్వంభర, బర్కత్ పుర :  శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ రామ నవమి ఉత్సవ సమితి  కన్వీనర్  గౌతం రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాదు బర్కత్పుర లోని తుల్జా భవన్ ఆలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  శ్రీ రామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న అంబర్ పేట్ ఎంసిహెచ్ గ్రౌండ్ నుంచి కాచిగూడ వీర్ సావర్కర్ చౌక్ వరకు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వైభవంగా కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే విధంగానే అంబర్ పేటలో కూడా శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.ఈ కార్య క్రమంలో మాజీ కార్పొరేటర్లు కన్నె ఉమా, రమేష్ యాదవ్, వనం రమేష్, అడపా చంద్రమౌళి, నేతలు ఎడెల్లి అజయ్ కుమార్, శ్యామ్ రాజ్, శ్రీధర్, శ్రావణ్, నర్సింగ్ రావు, సూర్య ప్రకాష్ సింగ్ పాల్గొన్నారు.

Tags: