రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
విశ్వంభర, చింతపల్లి: రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి అన్నారు. బుధవారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 4 నుండి నిర్వహిస్తున్న రైతు వారోత్సవంలో భాగంగా రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించే క్రమంలో మూడవ రోజు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదర్శ రైతులకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించాలని, ప్రత్యేకించి ఆయా భూములకు అనుకూలంగా ఉండే పంటలు పండిస్తే అధిక దిగుబడులతోపాటు, అధిక లాభాలు సాధించవచ్చని అన్నారు. పండిన పంటకు పూర్తిస్థాయిలో లాభం వచ్చినప్పుడే రైతు అలాంటి పంటల వైపు మొగ్గు చూపుతాడని, మార్కెట్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని అన్నారు. రైతులు ఒకే పంటను పండించకుండా అన్ని రకాల పంటలు పండించాలని, ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు, కొత్తగా వస్తున్న మార్పులపై దృష్టి సారించి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా పంటలు పండించాలని చెప్పారు. వరిలో ఎల్లప్పుడూ దొడ్డు బియ్యం కాకుండా, డిమాండ్ ఉన్న సన్న బియ్యం ఇతర రకాల ధాన్యాన్ని పండించాలని రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ధాన్యం సేకరణను త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.రైస్ మిల్లర్లు, లారీలు, వర్షం, తదితర కారణాలవల్ల కొనుగోలులో కొద్దిపాటి జాప్యం ఏర్పడిందని, మిల్లర్లు, హమాలీలు తదితర సమస్యలను ఎమ్మెల్యే బాలు నాయక్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహకార శాఖ సొసైటీల ద్వారా అందించే పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, ఎమ్మార్వో విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల యాదగిరి,స్థానిక సర్పంచ్ కాసరపు శ్వేత శ్రీనివాస్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ నల్ల సుధాకర్ రెడ్డి, ఆర్ఐ సునీత, మాజీ జెడ్పిటిసి హరిలాల్ నాయక్, అంగిరేకుల గోవర్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎండి ముషావర్, హనుమా నాయక్ నేరటి వెంకటయ్య, కట్ట మహేష్, గుణమోని కొండల్, అధికారులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.



