బీసీ కమిషన్ కీలక నిర్ణయాలు.. పలు వర్గాల వినతులపై విచారణ
విశ్వంభర, జీహెచ్‌ఎంసీ: రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన బుధవారం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ-ఏ గ్రూప్‌లో అనాధలుగా గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న 10 ఏళ్ల వయోపరిమితిని 49 ఏళ్లకు పెంచాలన్న వినతిపై ఈ నెల 24న విచారణ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. అలాగే బీసీ-డీ జాబితాలోని సాతాని (చాత్తాద శ్రీవైష్ణవ) కులానికి సంబంధించిన అభ్యర్థనపై కూడా విచారణ చేపట్టనుంది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని లొద్ద కులాన్ని బీసీలుగా గుర్తించాలన్న వినతిపై వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో రిజర్వేషన్ల ఉల్లంఘనలపై విచారణ కొనసాగిస్తూ, సంబంధిత సంస్థల నుంచి మరింత సమాచారం కోరాలని కమిషన్ నిర్ణయించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యాసంస్థల్లో ఎంబీసీ విద్యార్థులకు అమలులో ఉన్న 5 శాతం రిజర్వేషన్లను కొనసాగించాలని, కేంద్ర ఓబీసీ జాబితాలో లేని 40 బీసీ కులాలకు చెందిన వారికి విద్య, ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించనుంది. సమావేశంలో కమిషన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.