పెద్దతండాలో రూ.39 లక్షలతో ఉపాధి పనులు

పెద్దతండాలో రూ.39 లక్షలతో ఉపాధి పనులు

విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని పెద్ద తండా(సీఎం)లో ఉపాధి పనుల నిర్వహణకు రూ.39 లక్షలు మంజూరు అయినట్లు  గ్రామ సర్పంచ్ బానోతు రేణుక  తెలిపారు. మురల కుంటలో ముమ్మరంగా చేపట్టిన చెరువు కూడిక తీత పనులను సర్పంచి గురువారం సందర్శించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చెరువు పూడిక మట్టితో రైతుల భూములు సారవంతంగా మారుతాయన్నారు.చెరువులు లోతై నీటి సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. పెద్ద తండా తోపాటు పరిధిలోని తండాలలో పలు పనులు చేపట్టేందుకు తన ఆధ్వర్యంలో జిపి పాలకమండలి ప్రణాళికను పంపించడంతో రూ.39లక్షలు మంజూరు కాగా మురలకుంటకు రూ.9 లక్షలు, సోమకుంట రూ.10 లక్షలు, పేదలబోడురూ.10 లక్షలు పాలపిట్టబోడు రూ. 10 లక్షల తో పనులు చేపట్టేందుకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. ఎండ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా పనులు చేసుకోవాలని ఉపాధి కూలీలకు సూచించారు. ఓఆర్ఎస్, త్రాగు నీరు,టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు చెప్పారు. సర్పంచి వెంట సీనియర్ నేత బానోతు నరేష్  నాయక్ తదితరులు ఉన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/employment-works-in-pedthanda-with-rs-39-lakhs/article-16523

Tags: