మరొకసారి వరించిన పిఎసిఎస్ చైర్మన్ పీఠం

మరొకసారి వరించిన పిఎసిఎస్ చైర్మన్ పీఠం

విశ్వంభర, చింతపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గతంలో ఇచ్చినటు వంటి జీవోను కొట్టివేస్తూ పాత పిఎసిఎస్ పాలకవర్గాన్ని కొనసాగించాలని భావించిన సందర్భంగా  చింతపల్లి మండల పాత పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య , పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ బాధ్యతను స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు సేవ చేసే భాగ్యం మళ్లీ మా పాలకవర్గానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం రైతులకు ఎలాంటి సమస్య రాకుండా అధికారులతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బాలు నాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags: