ముషీరాబాద్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
On
విశ్వంభర, ముషీరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలో కోటి నలభై రెండు లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ , సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముషీరాబాదు వార్డు గంగపుత్ర కాలనీలో రూ.70 లక్షలతో, గాంధీనగర్ మాల బస్తీలో రూ.42 లక్షలతో, కవాడిగూడ అడ్వకేట్ కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.



