మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది. - డా. కోడి శ్రీనివాసులు

ఓటు హక్కును వినియోగించుకున్న డా. కోడి శ్రీనివాసులు కుటుంబ సభ్యులు

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది. - డా. కోడి శ్రీనివాసులు

విశ్వంభర, చండూర్ :- చండూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు కౌన్సిలర్, చైర్మన్ అభ్యర్థి డా. కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు కుటుంబ సభ్యుల సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. చండూర్ మున్సిపాలిటీ వార్డులలో పదికి పది గెలిచి భారీ మెజారిటీ తో గెలుస్తున్నామని అన్నారు.  అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినవారికి, కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Tags: