మెడికల్ షాపుల యజమానులు సేవా దృక్పథంతో మెలగాలి

మెడికల్ షాపుల యజమానులు సేవా దృక్పథంతో మెలగాలి

విశ్వంభర, అంబర్ పేట : మెడికల్ షాపుల యజమానులు వ్యాపార ధోరణి కాకుండా సేవా దృక్పథంతో పనిచేయాలని అంబర్పేట డ్రగ్ ఇన్స్పెక్టర్ గోవింద్ సింగ్ సూచించారు. బుధవారం హైదరాబాదు నల్లకుంటలో అంబర్ పేట కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ముఖ్యమని తెలిపారు. ముషీరాబాదు డ్రగ్ ఇన్స్పెక్టర్ రేణుక మాట్లాడుతూ షాపుల నిర్వహణలో నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. హెచ్ఎసీఏ అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ సభ్యుల ఐక్యతతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా మెడికల్ షాపుల యజమానులు తమ ఆరోగ్య రక్షణ కోసం వ్యక్తిగత ఆరోగ్య భీమా పాలసీలు తీసుకోవాలని సూచించారు. ఏ విధమైన నిషేధిత డ్రగ్స్ విక్రయాలు చేయరాదని హెచ్చరించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలి కేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. శాశ్వత గౌరవ అధ్యక్షుడు వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం, ఐక్యతే అసోసియేషన్ లక్ష్యమని తెలిపారు. ఇకపై ఆన్‌లైన్ సేవలు, లైసెన్సింగ్ సంబంధిత సమాచారం నూతన కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. అధ్యక్షుడు నంగునూరు రమేష్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్ సాల్వే మాట్లాడుతూ కార్యవర్గ సభ్యుల సమిష్టి కృషితోనే ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భోగ శివకుమార్, ఎల్లంకి కిషోర్, మసిరెడ్డి శ్రీనివాస రెడ్డి, హనుమంతా రావు, నేతి ప్రవీణ్, పాండురంగ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags: