విజ్ఞాన్ లో ఘనంగా స్వపరిపాలన

విజ్ఞాన్ లో ఘనంగా స్వపరిపాలన

విశ్వంభర,ఇనుగుర్తి:మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రం లోని విజ్ఞాన్ హై స్కూల్ లో మంగళవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థిని విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల పాలనా విధులను నిర్వర్తించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీచింగ్ చేసే సమయంలో తమ నుభూతులను అనుభవాలను వివరించారు.హై స్కూల్ హెచ్ఎం గంజి అర్చనా రెడ్డి మాట్లాడుతూ,  విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్ర పోషించడం వల్ల నాయకత్వ లక్షణాల భివృద్ధి, మాట్లాడే ధైర్యం,స్పష్టత పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గంజి వీరేందర్ రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: