ఘనంగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారంలోని జగజ్జనని మహిమాన్విత శ్రీ ముత్యాలమ్మ తల్లి కి ఇనుగుర్తి పట్టణవాసులు బుధవారం బోనాల జాతర నిర్వహించారు. ఎడ్ల బండ్లు బైకులుకార్లు,ట్రాక్టర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుటుంబ సమేతంగా శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ముత్యాలమ్మ,మారమ్మ,పెద్దమ్మ,లోతు గుంట మైసమ్మ తల్లుల కు నిలయమైన ఆలయ గర్భగుడి ముందు తల్లులకు అత్యంత భక్తి శ్రద్ధలతో పట్నాలు వేశారు. అనంతరం కొత్త కొండలలో అమ్మవారి కి బోనం నైవేద్యాలు చేసి వేపాకులు,పసుపు కుంకుమలతో అలంకరించి డప్పు చప్పుళ్ళు, శివశక్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలను ఎత్తుకొని సామూహికంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలను సమర్పించారు.పొట్టేళ్లు, కోళ్ల తో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, గుజ్జునూరి వెంకన్న(గడ్డం)గుజ్జునూరి శ్రీకాంత్,రామ్ సలీం,గుజ్జునూరి వెంకన్న, బూర ఐలయ్య,బూర ఇస్తారి,దేవులపల్లి మధుసూధన్ , లక్ష్మయ్య,ఇసంపల్లి జానీ,మల్లెపాక రమేష్ లు మాట్లాడుతూ లోక పావని ముత్యాలమ్మ తల్లికి ఏటా వర్షాకాలం ముందు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు, ఈ క్రమంలో ఈసారి అమ్మవారికి బోనాలు చేశామన్నారు. పాడి పంటలతో ఆయురారోగ్యాలతో గ్రామాన్ని అన్ని విధాలుగా కాపాడాలని కోరుకున్నట్లు తెలిపారు.