విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
విశ్వంభర, కుత్బుల్లాపూర్: సూరారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కోల శ్రీకాంత్ ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని సూరారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీకాంత్ స్వగృహం లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు హాజరై కోలా శ్రీకాంత్ ముదిరాజ్ తో కేక్ ని కట్ చేయించి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు కోల రవీందర్ ముదిరాజ్, గుబ్బల లక్ష్మీనారాయణ, బషీర్, మక్సూద్ అలీ, ఎర్వ సాయికిరణ్ , నాయకులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



