పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

విశ్వంభర,  ఆత్మకూరు:   గుంతకల్ స్థానిక ఎస్కేపి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1983- 86 చదివిన బీకాం విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ ఏ.లక్ష్మయ్య కాలేజీ అభివృద్ధి గురించి పూర్వ విద్యార్థులకు తెలియజేశారు. పూర్వ విద్యార్థులు కాలేజీ అభివృద్ధికి తోడ్పడతామని  హామీ ఇచ్చారు. అదేవిధంగా పూర్వ విద్యార్థులు  పూర్వ అధ్యాపకులను  సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో పూర్వ అధ్యాపకుల ఆర్ఆర్ స్వామి,  కేకే ప్రసాద్ , రంగయ్య చౌదరి ,  కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వారి స్నేహ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి లక్ష రూపాయలు డొనేషన్ ప్రకటించారు.

Tags: