కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, కొమ్మాయిగూడెం గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతి కార్యాలయంలో, గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంగవైకల్యం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. విద్యార్ధుల అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ పంచాయతీలో ఉప-సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏ.ఎన్.ఎం సాదియా, ఆశా కళావతి తదితరులు పాల్గొన్నారు.



