సర్వీస్ రోడ్డును వెంటనే నిర్మించాలి

సర్వీస్ రోడ్డును వెంటనే నిర్మించాలి

విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేట మహంకాళి టెంపుల్–బొడ్రాయి మార్గంలో సర్వీస్ రోడ్డును వెంటనే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ సీనియర్ నాయకుడు చింతల శ్రీనివాస్ ముదిరాజ్ అధికారులను కోరారు. ఫ్లైఓవర్ ప్రారంభమై దాదాపు పది నెలలు గడిచినా కింది భాగంలో ముఖ్యమైన సర్వీస్ రోడ్డును నిర్మించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కంకర తేలి గోతులుగా మారిన రహదారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డును నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: