ఘనంగా స్వపరిపాలనా దినోత్సవం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, పల్లివాడ గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం రోజు విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి కలెక్టర్, తహసిల్దార్, జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి, సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులుగా ఒక రోజు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ పాత్రలలో లీనమై అబ్బురపరిచారు. కలెక్టరుగా ఆవుల సీతు, హెడ్మాస్టరుగా జటంగి స్వాతి, జిల్లా విద్యాధికారిణిగా మాదాసు అక్షిత, మండల తహసిల్దార్ గా కుమార్, మండల విద్యాధికారిగా డి.రేష్మ, సర్పంచ్ గా కంభంపాటి అక్షిత, ఎంపీటీసిగా సల్ల సలీం, అలరించారు. తమ పాఠశాల సమస్యలను ప్రజా ప్రతినిధులతో చర్చించారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులు తమ అనుభవాలను, అందరితో పంచుకున్నారు. టీచర్లు, తమ కొరకు చేసే కృషిని అనుభవంతో తెలుసుకున్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులనందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఘాసీరాం, రఘురాంరెడ్డి, జయశ్రీ, నిర్మలాదేవి, పాల్వంచ హరికిషన్, కృష్ణయ్య, భూపాల్, లలిత, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.



