మూడో తరగతి నుంచే ఏఐ బోధన: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

మూడో తరగతి నుంచే ఏఐ బోధన: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

దేశంలోని విద్యారంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశంలోని విద్యారంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా, భారతదేశంలోని 30 కోట్ల మంది విద్యార్థులకు ఏఐ సాంకేతికతను చేరువ చేస్తామని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన 'ఏఐ కాంక్లేవ్-2026' సదస్సులో ఈ మేరకు కీలక నిర్ణయాలను వెల్లడించారు. కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని కేవలం ఉన్నత విద్యకే పరిమితం చేయకుండా, మూడో తరగతి నుంచే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి అధునాతన పరిశోధనలు చేసే స్థాయి విద్యార్థుల వరకు అందరికీ ఏఐ పరిజ్ఞానం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఐ సాంకేతికత గణనీయమైన అభివృద్ధి సాధించిందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. కేవలం యంత్రంలా పనిచేయడమే కాకుండా, మనుషుల భావోద్వేగాలను కూడా అర్థం చేసుకునే స్థాయిలో ఏఐ అభివృద్ధి చెందడం గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. 

ఎడ్‌టెక్‌ స్టార్టప్‌లతో రౌండ్ టేబుల్ భేటీ
ఏఐ కాంక్లేవ్‌కు ముందు, ఢిల్లీలో మంత్రి అధ్యక్షతన 'ఎడ్‌టెక్‌ ఏఐ రౌండ్ టేబుల్' సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యారంగంలో ఏఐని ఉపయోగిస్తున్న 10 వినూత్న భారతీయ ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ల వ్యవస్థాపకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, వారి ఆవిష్కరణలను పరిశీలించారు. దేశంలో మేధో సామర్థ్యానికి లోటు లేదని, యువత నూతన ఆవిష్కరణలకు సాంకేతిక సంస్థలు పూర్తిగా సహకరిస్తున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

Read More హిందీపై మారన్ సంచలన వ్యాఖ్యలు.. బానిసత్వానికి దారి..!!