నిర్మల్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం   

నిర్మల్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం   

 విశ్వంభర, నిర్మల్ : 21వ వార్డు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  మహమ్మద్ ఇర్ఫాన్  గాజులపేట్  లో ఇంటింటి  ప్రచారం నిర్వహించారు.  వార్డు  అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనను  గెలిపించాలని  కోరారు. అభివృద్ధి ధ్యేయంగా  ప్రజాసేవ లక్ష్యంగా మీ ముందుకు వచ్చానని, వార్డులో ఉన్న సమస్యల్ని తీర్చడానికి ఎల్లవేళలా ముందుంటానని అన్నారు.  ప్రతి ఒక్కరూ హస్తం  గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు, బాబర్ ఖాన్, మహమ్మద్ ఎజాస్.  మహమ్మద్ మోబిన్,  రైస్ ఖాన్,  ముజాహిద్,   వసీం, తదితరులు పాల్గొన్నారు.

Tags: