మొబైల్ అసోసియేషన్ ఎన్నికలు

మొబైల్ అసోసియేషన్ ఎన్నికలు

విశ్వంభర, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్స్ వేదికగా ఆదివారం నిర్వహించిన మొబైల్ షాప్స్ అసోసియేషన్ ఎన్నికలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. మొత్తం 79 మంది సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో నూతన కమిటీ కార్యవర్గం ఎన్నికైంది. కాగా ఈ కమిటీ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికై సభ్యుల విశ్వాసాన్ని మరోసారి నిలబెట్టుకుంది. కమిటీ అధ్యక్షుడిగా గౌస్ భాయి, సెక్రటరీగా సూరి, కోశాధికారిగా జయప్రసాద్ ఎన్నికయ్యారు.ఈ ఎన్నికలను ఎన్నికల పరిశీలకులు బండి శ్రీనివాస్, జలగిరి నాయుడు, బత్తుల శశి, శ్రవణ్ పర్యవేక్షించారు. ఎన్నికల అనంతరం నూతన కమిటీ సభ్యులు తమపై నమ్మకం ఉంచిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాని, నరేష్, రమేష్, మీరా, రఫీ, శ్రీకాంత్, బద్రి, విజయ్, బాబు, సందీప్, కుమార్, ముకుందం, పవన్, కన్నా, ఫయాజ్, ప్రవీణ్, సతీష్, పాషా  తదితరులు పాల్గొన్నారు.

Tags: