హుస్నాబాద్‌లో మూడు రోజుల విత్తన మేళా
- ధృవీకరించిన విత్తనాలతో అధిక దిగుబడి
విశ్వంభర, హుస్నాబాద్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం అనిశ్చితంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున రైతులు తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి వేల్పుల పూజ సూచించారు. హుస్నాబాద్ రైతు వేదికలో నిర్వహించిన మూడు రోజుల విత్తన మేళాను ప్రారంభించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పప్పుధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. వర్షాకాల పంటల సాగులో ధృవీకరించిన, నాణ్యమైన విత్తనాల వినియోగంతో మెరుగైన దిగుబడులు సాధించవచ్చని రైతులకు వివరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు వాటి వినియోగంపై అవగాహన కల్పించేందుకే మూడు రోజుల పాటు విత్తన మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమకు అవసరమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతు వేదికలో ఏర్పాటు చేసిన మేళా నుంచి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వి.వి. రమణ, మండల అధ్యక్షుడు వెన్నరాజు, కౌన్సిలర్ కేశవేణి రమేష్, బి కే ఎస్ హుస్నాబాద్ డివిజన్ ఇంచార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి, ఏఈఓలు జి. వెంకట శివరాం, కె. విజయ్, ఎ. స్వామి, రైతులు గుర్రాల సంజీవరెడ్డి, ఓరుగంటి సుధాకర్, కనుకయ్య, ఎలకంటి మహేందర్ రెడ్డి, విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.