తెలంగాణ రక్షణ సేన జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జిగా నెమలికొండ వేణుమాధవ్ 

విశ్వంభర, సంగారెడ్డి: తెలంగాణ రక్షణ సేన పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జిగా తనను  నియమించి, పార్టీ బలోపేతానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని  నెమలికొండ వేణుమాధవ్ అన్నారు. పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తాను. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, యువతకు అవకాశాలు, రైతులు, మహిళలు, కార్మికులు మరియు అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నా వంతు బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తాను. ఈ సందర్భంగా నాపై విశ్వాసం ఉంచిన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీ రాష్ట్ర నాయకత్వం, జహీరాబాద్ పార్లమెంట్ పరిధి నాయకులు, కార్యకర్తలు, మిత్రులు మరియు అభిమానులందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలియజేస్తున్నానన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/nemalikonda-venumadhav-is-the-in-charge-of-telangana-raksha-sena-zaheerabad/article-19968

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్