ప్రభుత్వ పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
- ఎంఈఓ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా
విశ్వంభర, వలిగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వలిగొండ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఐఎస్ కోఆర్డినేటర్ సువర్ణకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు గడిచినా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫారాలు అందలేదని, వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు డైరీలు అందించడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. పహిల్వాన్‌పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెంటనే ప్రహరీ గోడ నిర్మించాలని, మండలంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, డిప్యూటేషన్ పేరుతో ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, ఇప్పటికే మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు నిధులు పెంచడంతో పాటు ప్రతి పాఠశాలలో వాచ్‌మెన్‌లను నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు మొగిలిపాక గోపాల్, కొండే కిష్టయ్య, దుబ్బ లింగం, కవిడే సురేష్, భీమనబోయిన జంగయ్య, వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, నాయకులు వేముల నాగరాజు, ధ్యానబోయిన యాదగిరి, కొండూరు సత్తయ్య, ఉండాటి పాపయ్య, గంగాపురం వెంకటేశం, ఏటెల్లి నరసింహ, కందుల మత్స్యగిరి, కంబాలపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు