హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
- అదనపు కలెక్టర్‌కు టీయూసీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం
విశ్వంభర, మహబూబాబాద్ : రాష్ట్రంలోని హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రగతిశీల హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల యాకయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది కోట్ల మంది, తెలంగాణలో 60 లక్షల మంది హమాలీలు వస్తువుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి సమగ్ర వేతన చట్టం, సంక్షేమ బోర్డు వంటి రక్షణ వ్యవస్థలు లేకపోవడంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినా కుటుంబాలకు సరైన భరోసా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో హమాలీల ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదని, వైద్య ఖర్చులు, పిల్లల విద్య తదితర అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల తరహాలో హమాలీలకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఈ వినతిపత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకులు పూనం రవికుమార్, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు వసంతరావు, వెంకన్న, రవి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.