ద్యార్థులు ఐఐటీ, నీట్‌లో ర్యాంకులు సాధించాలి

  • మహేశ్వరం తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించిన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు

విశ్వంభర, మహేశ్వరం : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబర్చాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు అన్నారు. సోమవారం మహేశ్వరం తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీకి విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంజయ్ జాజు కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులకు పూల బొకేలు, మొక్కలను అందజేసి వారిని ఆశ్చర్యపరిచారు. తరగతి గదులను పరిశీలించిన ఆయన విద్యార్థులతో నేరుగా మాట్లాడి బోధన తీరు, తరగతుల నిర్వహణ గురించి ఆరా తీశారు. ఉపాధ్యాయులు పాఠాలు సక్రమంగా బోధిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి అత్యున్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సంకల్పంతో కృషి చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించిన ఆయన, పలువురు విద్యార్థులను వారి భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకుని అభినందించారు. తాను కూడా 40 ఏళ్ల క్రితం తమ పాఠశాలకు వచ్చిన ఓ ఐఏఎస్ అధికారిని చూసి స్ఫూర్తి పొంది ఐఏఎస్ సాధించినట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ ఆన్‌లైన్ తరగతులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో పోటీ పరీక్షలపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఈ. గోపిని కలిసి పాఠశాల సమస్యలు, అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలకు సంబంధించిన ఎలాంటి అవసరాలైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు. పాఠశాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఐఏఎస్, శశాంక ఐఏఎస్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో, ఎంఆర్వో, ఎంపీడీవోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పాఠశాలను సందర్శించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఈ. గోపి హర్షం వ్యక్తం చేశారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/candidates-should-secure-ranks-in-iit-neet/article-19980

Tags: