రాంపల్లి–ఘట్కేసర్ రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలి
విశ్వంభర, ఘట్కేసర్ : రాంపల్లి–ఘట్కేసర్ రహదారి విస్తరణ పనులు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడంతో రహదారి విస్తరణ నిలిచిపోయి, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని విద్యుత్ శాఖ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి విద్యుత్ స్తంభాలను తొలగించి రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో రహదారిపై సురక్షిత రాకపోకలు సాధ్యమవుతాయని వారు తెలిపారు