.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాలని హైడ్రాకు ఫిర్యాదు
విశ్వంభర, హైదరాబాదు : కూకట్‌పల్లి–మూసాపేట గ్రామాల మధ్య ఉన్న సుమారు రూ.600 కోట్ల విలువైన 6.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి రక్షించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మూసాపేట నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఈ భూమిలో పాఠశాలలు, మంచినీటి శుద్ధి కేంద్రం కోసం స్థలాలు కేటాయించినప్పటికీ, నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆక్రమణలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. దుండిగల్‌లోని రెడీమిక్స్ ప్లాంట్ వల్ల వాయు, శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని మరో ఫిర్యాదు అందింది. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులు అందగా, అదనపు కమిషనర్ డి. ఆనంద్ కుమార్ వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించారు. అలాగే కుంట్లూరులో ప్రభుత్వ, భూదాన్ భూముల ఆక్రమణలు, కొల్లూరులో లేఅవుట్‌లో రహదారులు, పార్కుల ఆక్రమణలు, మన్సూరాబాద్‌లో ఓపెన్ స్పేస్‌లో అక్రమ నిర్మాణాలు, మహేశ్వరం సర్దార్‌నగర్‌లో భూముల్లో కృత్రిమంగా నీరు నిల్వ చేయడం, నార్సింగిలో పార్కుల స్థలాల ఆక్రమణలపై కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి. సంబంధిత స్థలాలను పరిరక్షించి ఆక్రమణలను తొలగించాలని బాధితులు హైడ్రాను కోరారు.