జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- వీఓఏల సమీక్ష సమావేశంలో ఎంపీడీవో శారదమ్మ
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో సోమవారం వీఓఏల (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్) సమీక్ష సమావేశం ఎంపీడీవో శారదమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల పనితీరును సమీక్షించి, వివిధ సెర్ప్ కార్యక్రమాల అమలుపై వీఓఏలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఎంటర్‌ప్రైజెస్, పీఎంఎఫ్‌ఎమ్ రుణాల పురోగతిని సమీక్షించారు. అలాగే తెలంగాణ జలసిరి కార్యక్రమం, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీఓఏలకు అవగాహన కల్పించారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు మండలంలోని 30 గ్రామపంచాయతీల్లో జలసిరి కార్యక్రమంపై గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శారదమ్మ తెలిపారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, ప్రతి పంటకు పంట కుంటలు, ప్రతి గ్రామానికి ఊట కుంటలు, బోరు బావుల రీచార్జ్ నిర్మాణాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో మండల ఏపీఎం సంతోష్ కుమార్, డీపీఎం యాదయ్య, విబిజి రామ్‌జీ ఈసీ ఆదిత్య రాజ్, సీసీలు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు.