ఇనుగుర్తి లో ఐకెపి కార్యాలయం ఏర్పాటు చేయాలి..

  •   సిఐటియు మండల కార్యదర్శి జయరాజు 
               
విశ్వంభర,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి లో సెర్ఫ్(ఐకెపి) కార్యాలయం ఏర్పాటు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి జల్లె జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇనుగుర్తి లో ఒక ప్రకటన విడుదల చేశారు. నిగృత్తి మండలం కొత్తగా ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ మహిళా సంఘాలకు సంబంధించిన ఐకెపి ఆఫీస్ ఏర్పాటు చేయకపోవడం తో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో 13 గ్రామాల పరిధిలో 16 గ్రామైక్య సంఘాలు ఉన్నాయని మహిళలు తమ కార్యకలాపాల కోసం పూర్వ మండల కేంద్రం కేసముద్రం వెళ్లాల్సి వస్తోందన్నారు. వెంటనే అధికారులు కేసముద్రం సాధికారత ఐకెపి మండల సమైక్య నుంచి ఇనుగుర్తి గ్రామైక్య సంఘాలను వేరుచేసి ఇనుగుర్తిలో సెర్ఫ్ (ఐకెపి) మహిళా సాధికారత కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ikp-office-should-be-set-up-in-inugurti/article-20031

Tags: