బాబా సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా సన్నిధిలో గురుపౌర్ణమి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనుంజయ తెలిపారు. గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు, సత్సంగాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో పాటు తాగునీరు, క్యూలైన్లు, పార్కింగ్, భద్రత తదితర సౌకర్యాలను సిద్ధం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సాయిబాబా ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.