30 పడకలకు పెంచి డయాలసిస్ ఏర్పాటు చేస్తాం

  •  జర్నలిస్ట్ చంద్రమౌళి వినతికి స్పందించిన వేం నరేందర్ రెడ్డి

విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని( పీహెచ్సీ) 30 పడకల ఆసుపత్రిగా పెంచి డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలకు ఎంపీ నరేందర్ రెడ్డి ఎంపీ బలరాం నాయక్ తో కలిసి వెళ్తున్న క్రమంలో నెల్లికుదురు సమీపంలోని రామకృష్ణ క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ సోమవారం కాంగ్రెస్ శ్రేణులు,వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించడంతో కొంతసేపు ఆగారు.ఈ సందర్భంగా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్త పల్లి కి చెందిన డయాలసిస్ బాధితులు సీనియర్ జర్నలిస్టు పెరుమానుల చంద్రమౌళి గౌడ్ మండల కేంద్రం నెల్లికుదురులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని, డయాలసిస్ బాధితులకు రూ.10వేల చొప్పున పెన్షన్ అందజేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన నరేందర్ రెడ్డి డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

🕒 14 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/we-will-increase-it-to-30-beds-and-set-up/article-18604

Tags: