గుండాల సర్కారు దవాఖానలో 24 గంటల వైద్య సేవలు పునరుద్ధరించాలి
- సీపీఎం ఆధ్వర్యంలో నిరసన.. అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం
విశ్వంభర, గుండాల: గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గతంలో మాదిరిగా 24 గంటల వైద్య సేవలను వెంటనే పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ పిలుపు మేరకు సోమవారం గుండాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దెపురం రాజు మాట్లాడుతూ, 2004 వరకు 24 గంటల వైద్య సేవలు అందించిన గుండాల ప్రభుత్వ ఆసుపత్రి గత 22 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షలకు పెంచుతామని, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరిస్తామని, పల్లె దవాఖానల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించి గ్రామస్థాయిలోనే డయాగ్నస్టిక్ సేవలు అందిస్తామని హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. మండలంలోని మాసానిపల్లి, అంబాల, సీతారాంపురం, రామారం పల్లె దవాఖానలకు మంజూరైన శాశ్వత భవనాల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. అలాగే యునాని, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం తదితర సిబ్బంది అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేసి, ఖాళీగా ఉన్న ఫార్మాసిస్టు, స్టాఫ్ నర్స్, ఏఎన్‌ఎం, అటెండర్, నైట్ వాచ్‌మన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పల్లె దవాఖానల్లో తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం గుండాల మండలానికి సంబంధించిన పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ. భాస్కరరావుకు అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి గుండాల మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అనంతుల అంజయ్య, బత్తిని బిక్షం, మాదరబోయిన శ్రీను, ఎనగందుల పెద్దస్వామి, సాలమ్మ, రాజు, జెన్నయ్య, సత్తయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.