విద్యార్థి నేతలపై కేసులు ఎత్తివేయాలి: ఏఐవైఎఫ్

విశ్వంభర, హిమాయత్‌నగర్ : ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రౌషన్ కుమార్ సిన్హా సహా విద్యార్థి, యువజన నాయకులపై నమోదు చేసిన రాజకీయ ప్రేరేపిత కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. హైదరాబాదు హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, విద్యార్థులపై అణచివేతకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ నిరంతరం పోరాడుతోందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థి, యువజన నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని, దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరోసారి యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఎన్. శ్రీకాంత్, హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ, షేక్ మహమూద్, మొగిలి లక్ష్మణ్, సైఫ్ అలీ ఖాన్, కళ్యాణ్, సి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cases-against-student-leaders-should-be-dropped-by-aif/article-19978

Tags: