రూ.15 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం

  • గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తాం : సర్పంచ్ మునగపాటి నవీన్

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని వివిధ కాలనీల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.15 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నూతన తాగునీటి పైప్‌లైన్ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ మాట్లాడుతూ, గ్రామంలో ఏ ఒక్క కుటుంబం కూడా తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పైప్‌లైన్ ఏర్పాటు ద్వారా అన్ని కాలనీలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే గ్రామ పంచాయతీ లక్ష్యమని పేర్కొన్న ఆయన, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జొరల రమేశ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి సుజాత, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/drinking-water-pipeline-works-started-with-rs-15-lakh/article-19991

Tags: