రైతు మేళాలో ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై అందుబాటులోకి తేవాలి
- భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇంచార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి డిమాండ్
విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో నిర్వహిస్తున్న రైతు మేళాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇంచార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. రైతు మేళాలో ప్రభుత్వ సూచించిన ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో లేకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రభుత్వం సూచించిన పంటల వివరాలపై రైతులు అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. మార్కెట్ కమిటీ చైర్మన్, సొసైటీ చైర్మన్ సమక్షంలో రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. రైతు మేళాలో ప్రభుత్వ విత్తనాలు, సబ్సిడీ విత్తనాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని, కేవలం ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న విత్తనాలనే రైతులకు సూచించడం సరికాదన్నారు. ప్రభుత్వ పరిశోధనా కేంద్రాల్లో ఉత్పత్తి చేసిన విత్తనాలు ఎందుకు అందుబాటులో లేవో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు రైతుల సమస్యలపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపించిన ఆయన, వ్యవసాయ శాఖ ఏడీఏ పనితీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా రైతు మేళాను సందర్శించి అధికారుల పనితీరును సమీక్షించాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్, జేడీఏ వెంటనే హుస్నాబాద్ రైతు మేళాను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. జూలై 27, 28, 29 తేదీల్లో నిర్వహించే రైతు మేళాల్లో ప్రభుత్వం నిర్ణయించిన 63 పంటల వివరాలతో పాటు వాటికి సంబంధించిన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, స్థానికంగా లేకపోతే జిల్లా స్థాయి నుంచి వెంటనే తెప్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆరుతడి పంటల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందుబాటులోకి తీసుకురాకపోతే భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు మేళా, రైతు వేదికల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని కవ్వ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు.