ఎల్‌బీనగర్‌ను ఇందిరమ్మ టవర్స్ పథకంలో వెంటనే చేర్చాలి

  • జోనల్ కమిషనర్‌కు బీజేపీ నేత సామ రంగారెడ్డి వినతిపత్రం

విశ్వంభర, హైదరాబాద్ : ఎల్‌బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇందిరమ్మ టవర్స్ పథకంలో వెంటనే చేర్చి, పేదలకు గృహ కలను సాకారం చేయాలని బీజేపీ ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మేడ్చల్ రూరల్ జిల్లా ప్రభారి సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మాజీ కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నాయికోటి పవన్ కుమార్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ ఎల్‌బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో (ఐఏఎస్)కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ, అత్యధికంగా నిరుపేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న ఎల్‌బీనగర్‌ను జాబితాలో చేర్చకపోవడం బాధాకరమన్నారు. వేలాది మంది పేద కుటుంబాలు సొంత ఇంటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ పథకం కింద దరఖాస్తుదారులపై విధిస్తున్న రూ.10,000 ఈఎండీ నిబంధనను రద్దు చేయాలని, లబ్ధిదారుల నుంచి ప్రతిపాదించిన ₹6 లక్షల కంట్రిబ్యూషన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్‌బీనగర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్, నూతి శ్రీనివాస్, సుందర్ నారాయణ, మల్లేష్ గౌడ్, విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, సిరి రెడ్డి, నీరంకి రవి తదితరులు పాల్గొన్నారు

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/lb-nagar-should-be-included-in-indiramma-towers-scheme-immediately/article-20029

Tags: