వివాద రహిత గ్రామాలుగా తీర్చిద్దిదాలి : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 

విశ్వంభర, మహబూబాబాద్ : ప్రతి గ్రామాన్ని వివద రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని , వివాదాలు ఏమైనా ఉన్నా గ్రామ పరిధిలోనే పరిష్కరించుకునేలా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ దాసరి నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. సోమవారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సంచార వాహనం ద్వారా  అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయవాది మాట్లాడుతూ ప్రతి చిన్న వివదానికి కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ విలువైన కోర్ట్ సమయాన్ని వృధా చేయకుండా, పరిష్కరించుకోదగిన, లేదా మధ్యవర్తిత్వ పరిధిలో రాగల వివాదాలను స్థానికంగానే పరిష్కరించుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఆశా వర్కర్స్ మరియు అంగన్వాడీ సిబ్బంది ని ఉద్దేశించి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టీ. సునీత  మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి లో పని చేసే వారు గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, వరకట్నం నిషేధ చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలు ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చునన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ కమటం యాకయ్య , పంచాయతీ కార్యదర్శి అభిలాష్, పారా లీగల్ వాలంటీర్స్ కొత్తపల్లి సిద్ధార్థ, శ్రావణ్, శేషగిరి రావు, భూక్య మహేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/villages-should-be-made-dispute-free-by-the-district-legal-services/article-20014

Tags: