రామన్నపేటలో యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల నియామకం

విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం ఆదేశానుసారం తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షులు ఏనుగు రఘుమా రెడ్డిల సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా,  రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో మండల పరిధి లోని 24 గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను నియమించినట్టు రామన్నపేట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బట్టె సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బట్టె సంతోష్ కుమార్ మాట్లాడుతూ, నూతన గ్రామ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కార్యకర్తలను సమన్వయం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నూతన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందుతుందని నమ్ముతున్నానని అన్నారు. కొత్తగా నియమింపబడ్డ నాయకులకు విజయవంతమైన పదవీకాలం ఉండాలని కోరారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/appointment-of-youth-congress-working-committee-members-in-ramannapet/article-19942

Tags: